Revanth: ఇందులో నా ప్రమేయం లేదు 9 d ago
అల్లుఅర్జున్ అరెస్ట్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ అన్నారు. ఇందులో నా జోక్యం ఏమీ ఉండదని పేర్కొన్నారు. చట్టం ముందు అంతా సమానమేనని సీఎం తెలిపారు. మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్ను బండి సంజయ్ తప్పుబట్టారు. తొక్కిసలాటలో మహిళ మృతి దురదృష్టకరమని, తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని బండి సంజయ్ పేర్కొన్నారు.